Home

»

Latest News

వ‌రుస నెల‌ల్లో కేథ‌రిన్ హ‌వా!

Apr 6, 2022 4:04PM

తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం.. ఇలా ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలోనూ క‌థానాయిక‌గా సంద‌డి చేసింది కేథరిన్ ట్రెసా. అయితే, ఎక్క‌డ కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకోలేక‌పోయిందీ ముద్దుగుమ్మ‌. ఉన్నంత‌లో తెలుగు, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో చెప్పుకోద‌గ్గ గుర్తింపుని తెచ్చుకుంది కేథ‌రిన్.

ఇదిలా ఉంటే, ఆ మ‌ధ్యంతా కోలీవుడ్ పైనే ఫోక‌స్ పెట్టిన కేథ‌రిన్.. రీసెంట్ టైమ్స్ లో మ‌ళ్ళీ టాలీవుడ్ వైపు దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. వ‌రుస‌గా మూడు సినిమాల‌తో ఇక్క‌డ ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ధ‌మైంది ఈ హాట్ బ్యూటీ. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌యమేమిటంటే.. ఈ మూడు చిత్రాలు కూడా వ‌రుస నెలల్లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. జూన్ సెకండాఫ్ లో శ్రీ‌విష్ణుతో జ‌త‌క‌ట్టిన `భ‌ళా తంద‌నాన‌` విడుద‌ల కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. జూలై 8న నితిన్ కి జోడీగా న‌టించిన `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం` తెర‌పైకి రాబోతోంది. అలాగే ఆగ‌స్టు 5న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆడిపాడిన `బింబిసార‌` సిల్వ‌ర్ స్క్రీన్ పైకి రానుంది. మ‌రి.. వ‌రుస నెల‌ల్లో వినోదాలు పంచ‌నున్న ఈ చిత్ర త్ర‌యాల‌తో  కేథ‌రిన్ ట్రెసా ఎలాంటి ఫ‌లితాల‌ను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com