యూట్యూబర్ హర్షసాయిపై మరో కేసు.. సేవ పేరుతో చేసే పనులు ఇవా!
on Mar 16, 2025
బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకొని ఎందరో యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో యువత జీవితాలను నాశనం చేసే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని నిబంధనలకు విరుద్ధంగా ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై కూడా కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. (Harsha Sai)
బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా పోరాడున్న ఐపీఎస్ వీసీ సజ్జనార్.. హర్షసాయిపై కేసు నమోదు అవ్వడంపై స్పందించారు. "బెట్టింగ్ యాప్ లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా? సమాజహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా!? ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్ లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయండి." అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
కాగా, గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలతోనూ హర్షసాయిపై కేసు నమోదు కావడం గమనార్హం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
