బ్రహ్మోత్సవం సెన్సార్ రివ్యూ..!
on May 17, 2016
మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న బ్రహ్మోత్సవం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. సినిమాల్ని ఇష్టపడి, ప్రేమించే ఏ నలుగురు కలుసుకొన్నా... ఈ సినిమా గురించే చర్చ. బ్రహ్మోత్సవం ఎలా ఉంటుంది? ఈసారి మహేష్ ఎంత హంగామా చేయబోతున్నాడు? అనే విషయాలపై ఆసక్తిగా మాట్లాడుకొంటున్నారు. బ్రహ్మోత్సవం విడుదల తేదీకి దగ్గరపడుతుండడంతో ఆ ఆసక్తి మరింత ఎక్కువైంది. ఈలోగా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. బ్రహ్మోత్సవం ఎలా ఉండబోతోంది? హైలెట్స్ ఏంటి? అనే విషయాలపై ఓ క్లారిటీ వచ్చింది.
ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ ఫ్యామిలీ డ్రామాలోనే ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మిక్స్ చేశారట. మహేష్ - కాజల్ - సమంత... ఈ ముగ్గురి చుట్టూ నడిచే ప్రేమ కథ ఆసక్తి కలిగిస్తుందని టాక్.
విజువల్ గా బ్రహ్మోత్సవం సినిమా ఓ రేంజులో ఉండబోతోంది. రత్నవేలు కెమెరాపనితనం, తరణి కళా ప్రతిభ ఇవన్నీకలసి... ఈసినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చాయని తెలుస్తోంది. అంతేకాదు.. లొకేషన్లూ కొత్తగా ఉంటాయట.
ఈ సినిమా టేకాఫ్ స్లోగా ఉందని.. అయితే ఇంట్రవెల్ నాటికి... అంతా సర్దుకొందని, ఇంట్రవెల్ సీన్ కంట తడిపెట్టించేలా ఉందని. అందులో మహేష్, సత్యరాజ్‌ల నటన హైలెట్ అని తెలుస్తోంది.
సెకండాఫ్‌లో సినిమా అక్కడక్కడ ల్యాగ్ గా అనిపించినా.. ప్రీ క్లైమాక్స్ లో మళ్లీ కుదురుకుందని, క్లైమాక్స్ లో మహేష్ ఏడిపించి పంపుతాడని చెబుతున్నారు. రేవతి పెర్‌ఫార్మ్సెన్స్‌ని కూడా కొన్నాళ్లు మర్చిపోలేమట. రావు రమేష్‌కి మరోసారి మంచి మార్కులు పడడం ఖాయమంటున్నారు.
శ్రీకాంత్ అడ్డాల ఎమోషనల్ సీన్స్ రాయడంలో దిట్ట. అయితే ఈసినిమాలో కామెడీని కూడా బాగా వర్కవుట్ చేశాడట. పాత్రల బాడీ లాంగ్వేజ్ నుంచే కావల్సినంత వినోదం పంచి పెట్టాడని తెలుస్తోంది.
మొత్తంమ్మీద ఇది మహేష్ వన్ మ్యాన్ షోలాంటి సినిమా. మహేష్ అందం, నటన, తన ఈజ్‌తో బ్రహ్మోత్సవం సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించాడట. ఓవర్సీస్‌లో ఈ సినిమా రికార్డు వసూళ్లు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. శ్రీమంతుడు రూ.150 కోట్లు సాధించి.. టాప్ 2లో ఉంది. ఆ స్థానానికి బ్రహ్మోత్సవం చేరువయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.