బ్రహ్మాజీని చితక్కొట్టిన హీరోయిన్!
on Oct 15, 2019
.jpg)
హీరోయిన్‌కి కమెడియన్ లైన్ వేసే కాన్సెప్ట్ మీద చాలామంది దర్శకులు కామెడీ పండించారు. అలాగే, కమెడియన్‌ని ఇతర ఆర్టిస్టుల చేత కొట్టించడం కాన్సెప్ట్‌తోనూ బోలెడు సినిమాల్లో ఫన్ పుట్టించారు. ఫర్ సపోజ్... హీరోయిన్‌కి, అదీ దెయ్యం ఆవహించిన హీరోయిన్‌కి కమెడియన్ లైన్ వేస్తే? కమెడియన్‌ని హీరోయిన్ చితక్కొడితే ఎలా ఉంటుందనే ఐడియా ఓంకార్‌కి వచ్చింది. ఈ కాన్సెప్ట్ మీద ‘రాజుగారి గది 3’లో సూపర్ కామెడీ ట్రాక్ చేశాడట. హీరోయిన్ అవికా గోర్‌కి బ్రహ్మాజీ లైన్ వేసే సన్నివేశాలు, అతడిని ఆమె చితక్కొట్టే సన్నివేశాలకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వడం ఖాయమట. ఆ కామెడీ ట్రాక్ బాగా వచ్చిందట. ముఖ్యంగా బ్రహ్మాజీ ఇరగదీసి నటించాడట. అశ్విన్‌బాబు హీరోగా, ‘రాజుగారి గది’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా వస్తున్న ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తొలి రెండు భాగాల కంటే ఈ భాగం ఎక్కువ నవ్విస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



