అంతా దైవేచ్ఛ.. అఖండ 2 పై బోయపాటి కీలక వ్యాఖ్యలు
on Dec 11, 2025

బోయపాటి ఏమన్నాడు!
అభిమానుల్లో భారీ అంచనాలు
ఈ రోజు ప్రీమియర్స్ తో రెడీ
బాలయ్య(Balakrishna),బోయపాటి శ్రీను(Boyapati Srinu)కాంబోకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆ కాంబో ద్వారా తమ రేంజ్ ని పెంచుకోవడంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులు కూడా నమోదు చేసారు. దీంతో ఈ రోజు ప్రీమియర్స్ తో ల్యాండ్ అవ్వనున్న అఖండ 2 పై ఇద్దరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. రీసెంట్ గా బోయపాటి, థమన్ తో కలిసి అఖండ 2 ఘనవిజయం సాధించాలని ఆంధ్రప్రదేశ్(Ap)లో కొలువై ఉన్న 'శ్రీశైలభ్రమరాంబమల్లికార్జునస్వామి' ని దర్శించుకున్నాడు.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతు అన్ని విఘ్నాలు తొలగి ఈరోజు రాత్రి ప్రీమియర్ షో తో మూవీ రిలీజ్ కానుంది. అడ్డంకులు తొలగడంతో స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నాను. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. మీడియా ప్రతినిధులు అఖండ 2 సాధించే రికార్డులపై మాట్లాడాలని కోరగా రికార్డులు రావడం దైవేచ్ఛ. మంచి సినిమా తీసి ప్రజల ముందుకు వచ్చానని తెలపడం జరిగింది.
also read: అఖండ 2 ప్రీమియర్స్ కి హైకోర్ట్ షాక్.. బెనిఫిట్ షో ఉందా లేదా!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



