Home

»

Latest News

రిలీజ్ కి ముందే రామాయణకి పైరసీ సెగ: బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ!

Nov 3, 2026 12:06PM


మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'రామాయణ' వరల్డ్ వైడ్ గా ఈ నెల 5న రిలీజ్‌కి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వ ప్రతిభ,   రాముడిగా  రణబీర్ కపూర్, సీతమ్మ వారుగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ ఎలా మెస్మరైజ్ చేయబోతున్నారనే క్యూరియాసిటీ అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకుల్లో చాలా బలంగా ఉంది.

  అయితే ఈ దివ్య చరితంపై పైరసీ భూతం ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా మేకర్స్‌కు ఊరటనిస్తూ బాంబే హైకోర్టు కీలకమైన మధ్యంతర రక్షణ (Interim Protection) కల్పించింది. గోడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కాపీరైట్ ఉల్లంఘన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ మాధవ్ జే జమ్‌దార్ నేతృత్వంలోని బాంబే హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రానికి సంబంధించిన ట్రిల్లర్లు, మేకింగ్ వీడియోలు మరియు విడుదలకు ముందే కొన్ని దృశ్యాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం పట్ల మేకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా స్క్రిప్ట్, పాత్రలు, ఫుటేజ్, పాటలు, సౌండ్ రికార్డింగ్‌లకు కూడా పూర్తి స్థాయి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టుని  కోరారు. దీనిపై స్పందించిన కోర్టు, తెలియని వ్యక్తులు, పలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ సినిమాను అనధికారికంగా రికార్డ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, లేదా సోషల్ మీడియాలో ప్రసారం చేయడాన్ని నిరోధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  


ఇది కూడా చదవండి: సినిమా టిక్కెట్ల కోసం రికమండేషన్ చేసే రోజులు మళ్ళీ వస్తాయా? లేక గత చరిత్రేనా? 

 

 

 అంతేకాకుండా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) మరియు గూగుల్ వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలు, సోషల్ మీడియా మధ్యవర్తులు పైరసీ లింక్‌లు లేదా కాపీరైట్ ఉల్లంఘించే కంటెంట్‌ను తక్షణమే బ్లాక్ చేయాలని లేదా తొలగించాలని ఆదేశించింది. కేవలం ఒరిజినల్ లింక్‌లే కాకుండా, ఆ తర్వాత పుట్టుకొచ్చే మిర్రర్ వెబ్‌సైట్ల (Mirror Websites) పై కూడా కఠిన నిఘా ఉంచాలని, గోడ్‌పవర్ మీడియా నుంచి రాతపూర్వక ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాలని స్పష్టం చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మేకర్స్ , అభిమానులు,సినీ ప్రియులు, సినీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

 

[Bombay High Court Protects Ramayana From Piracy, Bombay High Court About Ramayana, Ranbir Kapoor Ramayana, anti piracy order, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com