బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌కు తీవ్ర అస్వస్థత
on Apr 16, 2016
బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఛాతీనొప్పికి గురికావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆస్పత్రికి చేర్పించారు. దిలీప్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నారు. భారతీయ సినిమాలో విషాదచిత్రాల హీరోగా దిలీప్‌కు పేరుంది. ఆయనకు 1994లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.