బిత్తిరి సత్తికి కొవిడ్19 పాజిటివ్
on Aug 15, 2020

తెలంగాణ యాస భాషలతో తనదైన కామెడీ టైమింగ్‌తో న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్స్ ద్వారా బుల్లితెర వీక్షకులలో 'బిత్తిరి' సత్తి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వి6 ఛానల్‌లో తన ప్రయాణం ప్రారంభించి, అక్కడి నుండి టీవీ9 వచ్చి, ప్రస్తుతం సాక్షిలో ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఆయన అసలు పేరు చేవెళ్ల రవికుమార్.
సాక్షిలో 'గరంగరం వార్తలు' కార్యక్రమం చేస్తున్నాడు బిత్తిరి సత్తి. ప్రస్తుతం దానికి టీఆర్పీ బావుంది. అయితే, దానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సత్తి కరోనా బారిన పడ్డాడు. అతడు పరీక్షలు చేయించుకోగా, కొవిడ్19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో హోమ్ క్వారంటైన్‌కి వెళ్ళాడు. అలాగే, అతడితో పాటు కార్యక్రమం చేస్తున్న మిగతా బృందం సైతం హోమ్ క్వారంటైన్‌కి వెళ్ళారు. రెండు వారాలు ట్రీట్మెంట్ తీసుకుని, తరవాత మళ్ళీ పరీక్షలు చేయించుకుని నెగెటివ్ అని తేలాక విధుల్లోకి వస్తారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



