బిగ్‌బాస్‌గా ఎవరు బెటర్..?
on Feb 20, 2018
హిందీలో సక్సెస్ అయిన బిగ్‌బాస్‌ను రీజనల్ ఛానెల్స్‌లోనూ ఇంట్రడ్యూస్ చేసింది స్టార్. అలా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళ్లో కమల్‌హాసన్, కన్నడలో సుదీప్ హోస్ట్‌లుగా ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తెలుగులో సీజన్-1 లాంచ్ అయ్యేటప్పుడు బిగ్‌బాస్‌గా ఎన్టీఆర్ వ్యవహరించబోతున్నాడు అన్నప్పుడు.. జూనియర్ దీనిని నడపగలడా.? సరదాగా మాట్లాడగలడా..? అనే డౌట్ చాలామందికి కలిగింది. కానీ మాట, ఆట, పాటలతో 70 ఎపిసోడ్ల పాటు తెలుగునాట.. ఇంటిల్లిపాదీ బుల్లితెరకు అతుక్కుపోయారంటే అది ఎన్టీఆర్ మాయాజాలమే.
ఫస్ట్ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోవడంతో సెకండ్ సీజన్‌కు కూడా ఎన్టీఆరే కంటిన్యూ అవుతారని నిర్వాహకులతో పాటు ప్రేక్షకులు భావించారు. అయితే వరుస సినిమాల కారణంగా డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని.. ఎన్టీఆర్ నో చెప్పేయడంతో.. నిర్వాహకులకు మరో హోస్ట్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వార్త అలా బయటకు వచ్చిందో లేదో నేచురల్ స్టార్ తెరమీదకు వచ్చారు. సైమా అవార్డ్స్ ఫంక్షన్లో హోస్ట్‌గా అలరించడంతో పాటు.. సందర్భానికి తగ్గట్టుగా పంచ్‌లు విసరడంలో నాని దిట్ట. దీంతో నానిని బిగ్‌బాస్‌గా కన్ఫర్మ్ చేశారని ప్రచారం జరిగింది. తీరా తెల్లవారిందో లేదో బన్నీ సీన్లోకి ఎంటరయ్యాడు.. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గ స్టార్ హీరో కావడంతో పాటు.. ఫ్యాన్‌బేస్.. మాట తీరు కారణంగా అల్లు అర్జున్‌కు స్కోప్ బాగానే ఉంది. మరోవైపు రామ్‌చరణ్, రానా పేర్లను నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు టాక్.. మరి వీరిలో ఎవరు బిగ్‌బాస్-2 లీడర్ అవుతారో చూడాలి.