Home

»

Latest News

'బిగ్‌ బాస్' ఫేమ్ సోహెల్‌ హీరోగా 'బూట్ క‌ట్ బాల‌రాజు'!

Dec 8, 2021 3:34PM

బిగ్‌ బాస్ ఫేమ్ సోహెల్‌, అన‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'బూట్ క‌ట్ బాల‌రాజు'. ల‌క్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీ కోనేటి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నేడు(బుధవారం) హైద‌రాబాద్‌ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త స‌న్నివేశానికి దిల్‌ రాజు క్లాప్ కొట్టగా మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా సోహెల్ మాట్లాడుతూ.. "బిగ్‌బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత చేస్తున్న రెండో చిత్ర‌మిది. మంచి స్క్రిప్ట్ కుదిరింది. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం. బూట్ క‌ట్ బాల‌రాజు అనే క్యారెక్ట‌ర్ డెఫినెట్‌ గా మీ అంద‌రిలో ఉండిపోతుంది. అన్ని వ‌ర్గాల వారు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు" అన్నారు.

Also Read: ఛాన్స్ చిక్కింది.. ష‌న్నుపై స‌న్నీ పంచ్ పేలింది

అన‌న్య మాట్లాడుతూ.. "మ‌ల్లేశం సినిమా నుండి పెర్‌ఫామెన్స్ ఓరియెంటెట్ క్యారెక్ట‌ర్స్ రావ‌డం మొద‌లైంది. ఈ సినిమాలో కొంచెం బ‌బ్లీగా ఉండే క్యారెక్ట‌ర్. నాకు చాలా ఇష్ట‌మైన పాత్ర‌. సోహెల్‌ తో క‌లిసి చేయ‌డం చాలా హ్యాపీ" అన్నారు.

Also Read: ఎమ్మెస్ చనిపోయే ముందు బ్రహ్మానందాన్ని చూడాలన్నారు!

శ్రీ కోనేటి మాట్లాడుతూ.. "బూట్‌క‌ట్ బ‌ల‌రాజు క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. రెండు గంట‌లు హ్యాపీగా న‌వ్వుకునే సినిమా" అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com