ఈగను పక్కకు నెట్టిన బిచ్చగాడు..!
on Oct 7, 2016

బిచ్చగాడు..అసలు ఏ మాత్రం అంచనాల్లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 50 లక్షల రూపాయల చిన్న బడ్జెట్‌తో దీనిని తెలుగులో రిలీజ్ చేస్తే..అంతకు 50 రెట్లు వసూలు చేసి పెట్టింది. అంతేనా ఒక సినిమా వారం ఉంటే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో బోలెడు సెంటర్లలో శతదినోత్సవాన్ని జరుపుకుని కొత్త చరిత్ర సృష్టించింది. తాజాగా బిచ్చగాడు ప్రభంజనం బుల్లితెర మీద కూడా కంటిన్యూ అవుతోంది. గత వారం జెమిని టీవీలో ఈ సినిమా ప్రీమియర్ షో వేయగా..ఈ చిత్రానికి టీఆర్పీ రేటింగ్ 18.75 రావడం విషేషం. అవతల మిగతా ఛానెళ్లలో మంచి సినిమాలు, అదిరిపోయే షోలు ఉన్నా సరే జనం బిచ్చగాడివైపే మొగ్గు చూపారు.
దీంతో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాల్లో బిచ్చగాడు ఎనిమిదో స్థానంలో నిలిచింది. బిచ్చగాడి కంటే ముందు శ్రీరామరాజ్యం, మగధీర, బాహుబలి, శ్రీమంతుడు, సీతమ్మ వాకిట్లో సిరిమిల్లె చెట్టు, అత్తారింటికి దారేది, రోబో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెంకటేశ్ దృశ్యం, రాజమౌళి ఈగ ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో బిచ్చగాడు ఇంకేంత చరిత్ర సృష్టిస్తాడో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



