తెలుగువన్ షార్ట్ ఫిల్మ్ విన్నర్ 'sehon' కు పదివేల బహుమతి
on Feb 19, 2015
ఇప్పుడు ఎక్కడ చూసిన షార్ట్ ఫిల్మ్ హావా నడుస్తుంది. చాలా మంది యంగ్ టాలెంట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకులుగా ఎదుగుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన తెలుగువన్ అనేకమంది యువతీయువకులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా షార్ట్ ఫిలిం దర్శకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలుగువన్ నెలనెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి ప్రతి నెల పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

తెలుగువన్ అందించిన షార్ట్ ఫిలిం అవకాశం మెట్టు ఎక్కిన చాలామంది తమ ప్రతిభతో మరిన్ని మెట్లు ఎక్కి సినిమా రంగానికి చేరువయ్యారు కూడా. 16 డిసెంబర్ నుంచి 15 జనవరి వరకు తెలుగువన్ ప్రోత్సాహంతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ లో 'sehon' దర్శకత్వంలో రూపొందిన ‘Chelivai Kalisene' షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్౦గా ఎంపికయింది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన ఉత్తమ దర్శకుడు 'sehon' కి తెలుగువన్ క్రియేటివ్ హెడ్ మల్లిక్ గారు పదివేల రూపాయల చెక్‌ని ఇచ్చి ప్రోత్సహించారు. షార్ట్ ఫిల్మ్ రూపకర్తలకు తెలుగువన్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుని మరిన్ని ఉత్తమ షార్ట్ ఫిలింలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



