Home

»

Latest News

థియేటర్స్ ని షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్..ఓటీటీలో చూస్తే మైండ్ బ్లాక్

Jun 2, 2026 3:50PM

 


తెలుగు ప్రేక్షకులకి హాలీవుడ్ సినిమాలు కొత్త కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా హాలీవుడ్ చిత్రాలని చూస్తూ వస్తున్నారు. పైగా వాటిల్లోనూ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ ఇచ్చే కిక్ అయితే చెప్పక్కర్లేదు. స్క్రీన్ ముందు కూర్చుంటే కలిగే ఉత్కంఠ, చేజింగ్ సీన్లు, ఊహించని ట్విస్టులు ఆ మజాని  మాటల్లో చెప్పలేం. థియేటర్లలోనే కాదు, ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వేదికగా ఓటీటీలో అందుబాటులో ఉన్న కొన్ని హాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులని  విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ  8 ఎపిక్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు ఏవి?  ఏ ఏ  ఓటిటిలో ఉన్నాయో చూద్దాం.

మొదటిగా చెప్పుకోవాల్సింది మైండ్ బెండింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇన్‌సెప్షన్'. 2010లో వచ్చిన ఈ క్రిస్టోఫర్ నోలన్  ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉంది. సుమారు 160 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 839 మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కలల ప్రపంచంలోకి వెళ్లి రహస్యాలను దొంగిలించే కాన్సెప్ట్‌తో సాగే ఈ సినిమా యాక్షన్ ప్రియులకి  ఒక విజువల్ ఫీస్ట్. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఆ తర్వాత 2014లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'ఇంటర్‌స్టెల్లార్' కూడా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తుంది. 165 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు 730 మిలియన్ డాలర్లను రాబట్టింది. మానవాళి మనుగడ కోసం అంతరిక్షంలో సాగే ఈ ప్రయాణం గుండెలను పిండేసే ఎమోషన్స్‌తో పాటు అద్భుతమైన స్పేస్ థ్రిల్‌ను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లలో ఈ మాస్టర్‌పీస్ అందుబాటులో ఉంది.

యాక్షన్ అంటే కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా అని నిరూపించిన చిత్రం 'ది డార్క్ నైట్'. జోకర్, బాట్‌మాన్ మధ్య సాగే మైండ్ గేమ్స్ ఈ సినిమాను ఆల్ టైమ్ గ్రేట్ యాక్షన్ మూవీగా నిలబెట్టాయి. 185 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.006 బిలియన్ డాలర్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ మరియు జియో సినిమాలో ఉన్న ఈ చిత్రం యాక్షన్ లవర్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. మరోవైపు, ప్యూర్ రా యాక్షన్ కావాలనుకునే వారికి కీను రీవ్స్ నటించిన 'జాన్ విక్' సిరీస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ముఖ్యంగా చాప్టర్ 4 కేవలం 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా 440 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఇందులో ఉండే స్టంట్ సీక్వెన్సులు, గన్ ఫైట్లు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. లయన్స్ గేట్ ప్లే మరియు ప్రైమ్ వీడియోలో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి.

ఇక రియలిస్టిక్ మిలిటరీ యాక్షన్ ఇష్టపడే వారికి 'బ్లాక్ హాక్ డౌన్' ఒక అద్భుతమైన ఎంపిక. సోమాలియాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మిలిటరీ ఆపరేషన్ల తీవ్రతను కళ్లకు కడుతుంది. 92 మిలియన్ డాలర్లతో రూపొంది 173 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం యాక్షన్ డ్రామాను సరికొత్తగా చూపిస్తుంది. ఈ జాబితాలో నెక్స్ట్ లెవెల్ ఛేజింగ్స్ తో అలరించే 'మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్' కూడా ఉంది. 150 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో వచ్చి 380 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా, ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 6 అవార్డులను కొల్లగొట్టింది. పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచంలో సాగే ఈ రోడ్ యాక్షన్ థ్రిల్లర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లభిస్తుంది. అలాగే, టామ్ క్రూజ్ నటన, సాహసాలు ఇష్టపడే వారి కోసం 'మిషన్ ఇంపాజిబుల్ - ఫాల్అవుట్' ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 178 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా 791 మిలియన్ డాలర్లని  వసూలు చేసింది. ఇందులో టామ్ క్రూజ్ స్వయంగా చేసిన డూప్ లేని స్టంట్స్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

Also read: Nikhil: గాయాలైనా వెనక్కి తగ్గని నిఖిల్.. పెద్ద సాహసమే అని చెప్పవచ్చు

చివరిగా, సైంటిఫిక్ అండ్ టైమ్ ఇన్వర్షన్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'టెనెట్' సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుంది. 200 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కరోనా కాలంలోనూ 365 మిలియన్ డాలర్లు సాధించింది. స్క్రీన్ ప్లే పరంగా మైండ్ బ్లాక్ చేసే ఈ 8 సినిమాలు  తెలుగు ఆడియోతో, సబ్‌టైటిల్స్‌తో విభిన్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ చిత్రాలని చూసీ అసలైన ప్రపంచ సినీ ప్రేమికులనే గుర్తింపు పొందండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com