Bsyపై సజ్జనార్ సీరియస్..ఇంత కంటే దౌర్బాగ్యం ఉందా
on Jan 24, 2025
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ బయ్యా సన్నీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.బయ్యా సన్నీ యాదవ్ (bby)పేరుతో వీడియోస్ చేస్తుంటాడు.రీసెంట్ గా ఒక బెట్టింగ్ యాప్ నిర్వాహుకుల దగ్గర డబ్బుల్ని తీసుకొని సోషల్ మీడియా ద్వారా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ వీడియో చేసాడు.ఇప్పుడు ఈ విషయంపై ఐపీఎస్ అధికారి సజ్జనార్(Sajjanar)సీరియస్ అయ్యాడు.
ఇంత కంటే దౌర్బాగ్యం ఇంకోటి ఉంటుందా.ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఇలాంటి వాళ్ళు చిత్ర చిత్ర వేషాలు వేస్తున్నారు.స్వార్ధం కోసం ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోల్నినమ్మి బెట్టింగ్ కూపంలో పడకండని సోషల్ మీడియా వేదికగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తు ఒక నోట్ ని విడుదల చెయ్యడం జరిగింది.ప్రజలు కూడా సన్నీ యాదవ్ లాంటి వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.యుట్యూబర్ హర్ష కూడా కొన్ని బెట్టింగ్ యాప్ లని ప్రమోట్ చేసి భారీగా డబ్బులు సంపాదించిన విషయం తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
