బండ్ల టార్గెట్ ... ఆ ఐదుగురు హీరోలే!
on Mar 2, 2015
.jpg)
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొడతా అంటున్నాడు గణేష్. చిన్న సినిమాలు తీస్తే రిస్క్ ఎక్కువని అందుకే తాను పెద్ద హీరోలనే నమ్ముకొంటానని తేల్చి పారేశాడు. పవన్, మహేష్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ.... ఈ ఐదుగురు హీరోల చుట్టే తిరుగుతానని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు. ``పెద్ద సినిమాలలో రిస్క్ తక్కువ. హీరోని చూపించి వ్యాపారం చేసుకోవచ్చు. సినిమాని అమ్మేసుకోవచ్చు. మంచి సినిమా తీసి పేరు తెచ్చుకోవాలని నాకు ఏమాత్రం లేదు. నాకు డబ్బులు ముఖ్యం`` అంటూ ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు గణేష్. అంతేకాదు.. తన స్ట్రాటజీని కూడా బయటపెట్టాడు. ఇండ్రస్ట్రీలో మిత్రులు, శత్రువులు ఉండరట. హిట్‌తో స్నేహం చేయాలి, ఫ్లాప్ నే శత్రవు అనుకోవాలని కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తనకు అందరు హీరోలూ కావాలని... తనతో సినిమా తీసే హీరోనే తనకు దేవుడని చెబుతున్నాడు బండ్ల. ఎప్పుడూ అతిశయోక్తులు మాట్లాడే గణేష్ తొలిసారి.. మనసు విప్పి నిజం చెప్పాడు కదూ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



