పవన్ పై బండ్ల గణేష్ మరో రకంగా ఎందుకు ట్వీట్ చెయ్యాల్సి వచ్చిందంటే
on Apr 15, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి సినిమా ఇండస్ట్రీ బయటే కాకుండా,ఇండస్ట్రీలోను పలువురు ప్రముఖులు అభిమానులుగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వాళ్ళల్లో ప్రముఖ నటుడు,నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh)కొంచం ముందు వరుసలో ఉంటాడు. ఒక రకంగా పవన్ కి అభిమాని అనే కంటే భక్తుడు అని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్నీ బండ్ల గణేషే చాలా సార్లు వెల్లడి చేసాడు. ఈ ఇద్దరి కాంబోలో తీన్ మార్, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు వచ్చాయి. వీటిల్లో గబ్బర్ సింగ్ పవన్ వరుస ప్లాపుల పరంపరకి ముగింపు పలకడమే కాకుండా, తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో పవన్ అభిమానులు బండ్ల గణేష్ ని అభిమానిస్తు సోషల్ మీడియా వేదికగా కూడా ఫాలో అవుతు ఉంటారు.
రీసెంట్ గా బండ్ల 'ఎక్స్' వేదికగా తీన్ మార్(Teen Maar)లోని పవన్ స్టిల్ ని షేర్ చేసి, 'థాంక్యూ పవన్ కళ్యాణ్ సర్' అనే క్యాప్షన్ ని జోడించడంతో పాటు నమస్కారం ఎమోజి ని ఉంచాడు. దీంతో సందర్భం అనేది లేకుండా బండ్ల ఎందుకు ఇంత హఠాత్తుగా పోస్ట్ చేసాడని అందరు భావించారు. కానీ ఆ తర్వాతే అసలు విషయం అర్ధమయ్యింది. తీన్ మార్ 2011 ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే నిన్నటికి 14 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగానే బండ్ల ట్వీట్ చెయ్యడంతో, బండ్ల నిజంగానే పవన్ కి భక్తుడు, అందుకే ప్లాప్ సినిమా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి తొలి సినిమా అవకాశాన్ని మర్చిపోకుండా ధన్యవాదాలు చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి తీన్ మార్ రీ రిలీజ్ డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే నిన్న రిలీజ్ చేసినా బాగుండేదనే అభిప్రాయాన్ని పలువురు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
బండ్ల గణేష్ గత కొంత కాలంగా సినిమాలు చెయ్యటం లేదు. ఇప్పటి వరకు తక్కువ సినిమాలే నిర్మించినా, విజయాల్ని మాత్రం ఎక్కువగానే అందుకున్నాడు. ఆంజనేయులు,బాద్ షా, గోవిందుడు అందరి వాడేలే, ఇద్దరమ్మాయలతో, నీ జతగా, టెంపర్ వంటి పలు చిత్రాలు ఆ లిస్ట్ లో ఉన్నాయి. త్వరలోనే సినిమాలు నిర్మిస్తానని ఇటీవల చాలా ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
