ప్రారంభమైన బాలయ్య-పూరి సినిమా
on Mar 9, 2017

నటసింహ నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధించింది. అయితే తన తర్వాతి సినిమాను ఎవరి దర్శకత్వంలో చేస్తాడు..కథ ఎలా ఉండబోతుంది అంటూ అభిమానులను రకరకాల ప్రశ్నలు వేధించాయి. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ, కేఎస్ రవికుమార్, సింగీతం శ్రీనివాసరావు వంటి దిగ్గజాలు కథలు చెప్పారు. ఒకరోజు కృష్ణవంశీతో సినిమా అని, మరోసారి కేఎస్ రవికుమార్‌తోనని, కాదు కాదు సింగీతం శ్రీనివాసరావుతో అంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
కాని ఎవ్వరూ ఊహించని విధంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమాను మార్చి 9న ప్రారంభించి సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తామని పూరి ప్రకటించాడు. చెప్పిన విధంగానే ఇవాళ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. హీరో బాలకృష్ణతో పాటు చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మార్చి 12 నుంచి 22 వరకు స్పెయిన్‌లో షూటింగ్ జరపుకోనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



