Home

»

Latest News

Balakrishna: బాలకృష్ణకి అరుదైన గౌరవం.. సిఎం చేతుల మీదుగా అందచేత

Mar 26, 2026

 


-పద్మభూషణ్ బాలకృష్ణకి మరో పురస్కారం
-అభిమానుల ఆనందం 
-సోషల్ మీడియాలో కనువిందు చేస్తున్న విజువల్స్ 

బాలయ్య బాలయ్య, గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య అని అభిమానులు అడుగుతున్నట్టుగానే, గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna)తన నట విశ్వరూపం తాలూకు ప్రభంజనాన్ని సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతున్నాడు. ప్రజాసేవలోను అదే పంధాని కొనసాగిస్తు సామాన్యులకి తక్కువ ధరకే క్యాన్సర్ ట్రీట్ మెంట్ ని ఇస్తు 'నో బడీ కెన్ రీచ్ హిమ్' అని మరోసారి అందరికి  గుర్తు చేస్తున్నాడు. రీసెంట్ గా బాలకృష్ణ అరుదైన పురస్కారాన్ని అందుకోవడంతో అభిమానులు, తెలుగు ప్రజల్లో ఆనందం వెల్లివిసురుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

నిన్న ఢిల్లీ(Delhi)లో 2026 వ సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఢిల్లీ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బాలకృష్ణకి సదరు కమిటీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుని ప్రకటించి సత్కరించింది. ఢిల్లీ  సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ అవార్డుని అందుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో అభిమానులతో పాటు తెలుగు ప్రజలు బాలకృష్ణకి కంగ్రాట్స్ చెప్తున్నారు. అదే వేదికపై సీనియర్ నటి షర్మిలా ఠాగూర్‌, దివంగత నటుడు ధర్మేంద్రగారికి కూడా  లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది.

also read: Anna lezhneva: కీలక నిర్ణయం తీసుకున్న అన్నాలెజినోవా.. వెల్ కమ్ చెప్తున్నపవన్  


బాలయ్య అప్ కమింగ్ సినిమా విషయానికి వస్తే వీరసింహ రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో చేస్తున్న షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలయ్య కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు టెక్నీకల్ పరంగాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మాణం జరుపుకోనుంది. బాలయ్య మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్టు టాక్.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com