బాలయ్య ని కాపీ కొడుతున్న చిరు
on Oct 25, 2016
చిరంజీవి, బాలకృష్ణ.. దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమకు మూల స్థంభాలుగా ఉన్న హీరోలు. ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం.. ఒకరి ట్రెండ్‌ని మరొకరు ఫాలో అవ్వడం వీళ్లకు అలవాటు. చిరంజీవి బ్రేక్ డాన్స్‌లను ఇంట్రడ్యూస్ చేస్తే బాలయ్య వెంటనే ఫాలో అయ్యాడు. బాలకృష్ణ నుంచి సమర సింహారెడ్డి లాంటి సీమ కథలొస్తే.. వెంటనే చిరు ఇంద్ర తీశాడు. అలా.. ఒకరు ఇంకొకరికి స్ఫూర్తి ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా బాలయ్య అడుగుజాడల్లో నడవాలనుకొంటున్నాడు చిరంజీవి. బాలకృష్ణ 101వ చిత్రం రైతులో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బీ రాకతో.. రైతు సినిమాకి బోల్డంత క్రేజ్ పెరిగింది. ఆసినిమా మొదలవ్వకముందే.. అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇప్పుడు ఇదే గేమ్ ప్లాన్ చిరు కూడా అవలంభించబోతున్నట్టు టాక్. చిరు 150వ సినిమా చేస్తే అందులో నేనూ నటిస్తా.. అని ఇదివరకెప్పుడో అమితాబ్ మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆఫర్ ని చిరు వాడుకోవాలని చూస్తున్నాడట. ఖైదీ నెం.150లో అమితాబ్ కోసం ఓ పాత్ర సృష్టించాలని చిరు ఉబలాటపడుతున్నాడట. వెంటనే బిగ్ బీని కలుసుకొని ఆయన నుంచి మాట తీసుకోవాలని చిరు ప్రయత్నిస్తున్నాడు. అమితాబ్ ఉన్నాడంటే ఆ సినిమాకొచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. దాంతో చిరు సినిమాకి ఊహించనంత మైలేజీ యాడ్ అవుతుంది. మరి అమితాబ్ ఏమంటాడో చూడాలి.