Home

»

Latest News

బాలయ్య vs మంచు మనోజ్: ‘దాదా’లో రక్తపాతం లేని వార్.. అసలు ట్విస్ట్ ఇదే.!

Nov 3, 2026 5:53PM

నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే భారీ ఫైట్లు, పవర్‌ఫుల్ డైలాగులు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఆయన మాస్ యాక్షన్ సన్నివేశాలకు థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ వేరే లెవల్‌లో ఉంటుంది. అయితే ఈసారి బాలయ్య తన రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నారా? ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దాదా’ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ, మనోజ్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. సాధారణంగా ఇద్దరు బలమైన ప్రత్యర్థులు తలపడితే భారీ ఫైట్లు, రక్తపాతం ఉంటాయని భావిస్తాం. కానీ ‘దాదా’లో మాత్రం అలాంటివేమీ లేకుండా కేవలం మాటలతోనే ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తుందని టాక్.

బాలయ్య తనదైన గంభీరమైన గొంతుతో పవర్‌ఫుల్ డైలాగులు చెబితే.. మంచు మనోజ్ కూడా అంతే ధీటుగా కౌంటర్లు ఇస్తాడని అంటున్నారు. ఇద్దరి మధ్య సాగే ఈ సంభాషణలు ప్రేక్షకుల్లో హై వోల్టేజ్ టెన్షన్ క్రియేట్ చేసేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా మాటలతోనే ప్రత్యర్థిని దెబ్బతీసే ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.

'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'దాదా'పై భారీ అంచనాలు ఉన్నాయి. 1980ల నాటి ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ ఇందులో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి: పాకెట్ రాకెట్స్ టీజర్.. గ్యాంబ్లింగ్ స్టోరీతో నిహారిక మరో కొత్త ప్రయత్నం.!

 

 

 

[Balakrishna Manchu Manoj Face Off, Dada Movie Update, Dada Movie, Nandamuri Balakrishna, Manchu Manoj, Gopichand Malineni, Kajal Aggarwal, Telugu Film News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com