బాలయ్య బర్త్ డే గిఫ్ట్.. గోపీచంద్ తో మూవీ అధికారిక ప్రకటన
on Jun 10, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు(జూన్ 10). ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త మూవీ సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయనున్నారు.
బాలయ్యతో తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు గోపీచంద్ మలినేని ఇదివరకే ప్రకటించారు. రవితేజతో చేసిన 'క్రాక్' మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ ఉత్సాహంతో ఓ పవర్ ఫుల్ స్టోరీతో బాలయ్యని కలిశాడు గోపీచంద్. స్టోరీ బాలయ్యకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక నేడు బాలయ్య బర్త్ డే కావడంతో మైత్రి మూవీ మేకర్స్ బాలయ్య-గోపీచంద్ ల మూవీపై ఈ ఉదయం 8:45 లకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చింది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించనున్నాడు.
కాగా బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ చేస్తున్నాడు. సింహ, లెజెండ్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య బర్త్ డే సందర్భంగా నిన్న(బుధవారం) కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేయగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
