అఖండ 2 కోసం పూజలు జరిపిస్తున్న జగన్
on Dec 2, 2025

-ఫ్యాన్స్ వెయిటింగ్
-ఎన్నో జన్మల అనుబంధం
-శ్రీకాళహస్తిలో పూజలు
-నెక్స్ట్ ఎక్కడికి
అభిమానులు, గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)కి మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తే ఎన్నో జన్మల నుంచి ఉన్న అనుబంధం అని అనిపిస్తుంటుంది. బాలయ్య పుట్టినరోజున, సినిమా రిలీజ్ రోజున రక్తదానాలు, అన్నదానాలు, ఆర్ధికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉండే సహాయాలు చెయ్యడం లాంటివి చేస్తుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే వారి మధ్య ఎన్నో జన్మల అనుబంధం ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ అభిమానులు అఖండ 2(Akhanda 2)రిలీజ్ సందర్భంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
అఖండ 2 లో అఘోర గా బాలకృష్ణ ఉపయోగించిన త్రిశూలాన్ని, ఢమరుకాన్ని తీసుకొని ఆ అఖండ నాధుడైన పరమేశ్వరుడు కొలువై ఉన్న పంచ శైవ క్షేత్రాలని దర్శించే మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నిన్న శ్రీకాళహస్తి లో కొలువై ఉన్న'శ్రీ కాళహస్తీశ్వరుడ్ని' దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ స్టేట్ వైడ్ అభిమాని,హెల్పింగ్ హ్యాండ్ అధ్యక్షుడు జగన్ తన బృందం తో కలిసి మాట్లాడుతూ అఖండ 2 విజయవంతం అవ్వాలని మొదట శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్శించుకున్నాం. ఇక్కడ నుంచి కంచి, అరుణాచలం, జంబుకేశ్వరం,చిదంబరం క్షేత్రాలని వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకొని అఖండ 2 కి ఘన విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటామని తెలిపారు.
aslo read: ఆంధ్రాకింగ్ తాలూకా విషయంలో పరిశ్రమ ఫెయిల్..భాగ్యశ్రీ బోర్సే ట్వీట్!
పలువురు అభిమానులు జగన్ బృందంతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఇక డిసెంబర్ 4 నుంచే వరల్డ్ వైడ్ గా బాలయ్య శివ తాండవం ప్రారంభం కాబోతుండంతో అభిమానులతో పాటు సినీ మార్కెట్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



