బాలకృష్ణ నుండి మరో చారిత్రక చిత్రం?
on Oct 28, 2020
నట సింహం నందమూరి బాలకృష్ణకు పౌరాణిక, చారిత్రక చిత్రాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. శకపురుషుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా ఆయన తెరపై కనిపించారు. అద్భుతంగా నటించారు. ఇటీవల విజయదశమికి పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’తో సందడి చేశారు. ఆయన మరో చారిత్రక చిత్రం చేయాలని అనుకుంటున్నట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం.
తెలుగు పౌరుషానికి ప్రతీకగా నిలిచిన మరో చారిత్రక వీరుడు గోన గన్నారెడ్డిగా బాలకృష్ణ నటించనున్నారని టాక్. ఆయన నటించే ఆ చారిత్రక చిత్రానికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. గోన గన్నారెడ్డి కథతో రూపొందబోయే చిత్రానికి దర్శకుడు, నిర్మాత ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. గోన గన్నారెడ్డి సినిమా చేస్తారేమో చూడాలి.
Also Read