Home

»

Latest News

ఆ ద‌ర్శ‌కుడి పేరు చెబితే.. బాల‌య్య‌కు భ‌యం

Nov 29, 2016 10:48AM

గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి బాల‌కృష్ణ వందో చిత్రం. 101వ సినిమాకీ ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశాడు బాల‌య్య‌. బాల‌య్య 101వ సినిమాగా రైతు వ‌స్తుంద‌ని, అందుకోసం కృష్ణ‌వంశీ స్క్రిప్టు కూడా సిద్దం చేశార‌ని వార్త‌లొచ్చాయి. ఈ సినిమా కోస‌మే బాల‌య్య‌, కృష్ణ‌వంశీలు అమితాబ్ బ‌చ్చ‌న్‌ని క‌లుసుకొని, ఓ పాత్ర చేయ‌మ‌ని అడిగారు కూడా. అయితే అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ని ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు బాల‌య్య కోసం క‌థ‌లు, ద‌ర్శ‌కుల్ని వెదికే ప‌నిలో ఉన్నారు. ఇటీవ‌ల కొంత‌మంది ద‌ర్శ‌కులు బాల‌య్య‌ని క‌ల‌సి క‌థ‌లు చెప్పారు. బాల‌య్య కూడా ప్ర‌తీ క‌థ‌నీ వింటున్నాడు. అయితే ఓ ద‌ర్శ‌కుడు బాల‌య్య చుట్టూ తిరుగుతున్నాడ‌ట‌. క‌థ చెబుతా.. వింటారా?  అని అడుగుతున్నాడ‌ట‌. అయితే.. బాల‌య్య మాత్రం క‌థ విన‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది.

ఆ ద‌ర్శ‌కుడే... పి.వాసు. చంద్ర‌ముఖిలాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ సినిమాని అందించారాయ‌న‌. బాల‌కృష్ణ‌తో మ‌హార‌థి కూడా తీశాడు. ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే పి.వాసు పేరుచెప్ప‌గానే బాల‌య్య భ‌య‌ప‌డుతున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పి.వాసు మంచి క‌థ చెప్పినా.. ఆయ‌న‌తో సినిమా చేయ‌క‌పోవడ‌మే న‌య‌మ‌ని బాల‌య్య భావిస్తున్నాడ‌ట‌. అందుకే పి.వాసుకి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. క‌థ‌లు, ద‌ర్శ‌కుల ఎంపిక విష‌యంలో బాల‌య్య ఎంత జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తున్నాడో దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోవొచ్చు. పాపం. .. బాల‌య్య అపాయింట్‌మెంట్ దొర‌క్క  ఆ ద‌ర్శ‌కుడు తెగ ఫీల్ అవుతున్నాడ‌ట‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com