బాహుబలి పై నిరసనలు, కారణం తెలిస్తే షాక్ అవుతారు
on Mar 25, 2017
.jpg)
పెద్ద సినిమాల చుట్టూ వివాదాలు ఉండడం కారణం. అందర్నీ దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీయాలంటే ఎవరికీ సాధ్యం కాదు. అసలు, ఎవరు ఎందుకు విమర్శలు, నిరసనలు వ్యక్తం చేస్తారో అర్ధం కాదు. బాహుబలి మొదటి భాగం విడుదలయినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా, బాహుబలి పలు సంచలనాలు సృష్టిస్తుంది. అయితే, బాహుబలి 2 మాత్రం ఇబ్బందులు ఎదుర్కుంటోంది. కర్ణాటకలో ఒక వర్గం సినిమాని అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే, కర్ణాటకకు, తమిళనాడుకి కావేరి జలాల విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడు తమిళనాటికి చెందిన సత్యరాజ్ తన రాష్ట్రానికి మద్దతుగా వ్యాఖ్యలు చేసారు. ఇది ఇప్పుడు రాజకీయం చేసి బాహుబలి 2 విడుదలని ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఒక వర్గం నాయకులు. బాహుబలి లో కట్టప్ప క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ తమకి క్షమాపణలు చెబితేనే విడుదలకి అనుమతివ్వాలని కర్ణాటక ఫిలిం అసోసియేషన్ లో కంప్లైంట్ చేసారు. దీనిపై రాజమౌళి, సత్యరాజ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే, మార్చ్ 26 న ఆడియో విడుదల జరుపుకోనున్న బాహుబలి 2, ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



