ఇంకా వారం రోజులే.. ఇక పవన్ కళ్యాణ్ నటనకు దూరమైనట్టేనా?
on Aug 7, 2025

పవన్ కళ్యాణ్ కొన్నేళ్లుగా సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటనకు దూరమవుతారని కొంతకాలంగా వినిపిస్తోంది. పవన్ సైతం తనకు నటించడానికి సమయం కుదరకపోవచ్చని, నిర్మాతగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. అదే జరిగితే ఇక పవన్ నటనకు దూరమైనట్టే.
ఇటీవల 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే 'ఓజీ' షూటింగ్ పూర్తయింది. ఇది సెప్టెంబర్ 25న విడుదల కానుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.
'ఉస్తాద్ భగత్ సింగ్'కి సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో వారం రోజులు కేటాయిస్తే చాలు.. ఆయన భాగం షూటింగ్ పూర్తవుతుందట. మొత్తం సినిమా షూటింగ్ పూర్తి కావడానికి మాత్రం మూడు వారాలు పట్టే అవకాశముంది.
నటుడిగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు కమిట్ అవ్వకపోతే.. 'ఉస్తాద్ భగత్ సింగ్' చివరి చిత్రం అవుతుంది. అదే జరిగితే.. కేవలం వారం రోజులు మాత్రమే ఆయన సెట్ లో నటుడిగా సందడి చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సినిమాలు కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోసమైనా భవిష్యత్ లో పవన్ సినిమాలు చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



