రాఘవేంద్రరావు చేతుల మీదుగా 'బ్యాక్ డోర్' ట్రైలర్
on Oct 27, 2021
పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బ్యాక్ డోర్'. ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్ విడుదల సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. "'బ్యాక్ డోర్' టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్" అన్నారు.
లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు తమ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read