బచ్చలమల్లి ఫస్ట్ డే కలెక్షన్స్
on Dec 21, 2024
అల్లరి నరేష్(allari naresh)చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ నెల 20 న'బచ్చలమల్లి'(bachhala malli)తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు.రిలీజ్ ముందు నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై,బెంగుళూర్,ముంబై వంటి ఏరియాల్లో కూడా రిలీజయ్యి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.
ఇక తొలిరోజు 'బచ్చల మల్లి' అరవై లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అన్ని ఏరియాల్లో కూడా మార్నింగ్ షో, మాట్నీ ఒక మాదిరిగా ఫుల్ అయినా కూడా ఫస్ట్ షో,సెకండ్ షోస్ చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్స్ అయ్యాయి.సినిమా టాక్ అంతకి అంత పెరుగుతుందనటానికి ఇదే ఉదాహరణ అని చిత్ర యూనిట్ చెప్తుంది.వీకెండ్ లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టి అల్లరి నరేష్ కెరిరీలో బెస్ట్ మూవీ కూడా అవుతుందని కూడా తమ ఆశాభావాన్ని వ్యక్తం చెయ్యడం జరిగింది
సాయి ధరమ్ తేజ్(sai dharam tej)హీరోగా వచ్చిన 'సోలో బతుకే సో బెటర్' మూవీ ఫేమ్ సుబ్బు మంగాదేవి(subbu mangadevi)దర్శకత్వంలో వచ్చిన 'బచ్చల మల్లి' ని హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మించగా 'హనుమాన్'(hamuman)ఫేమ్ అమృత అయ్యర్(amritha aiyer)హీరోయిన్ గా చేసింది.రావు రమేష్,అచ్యుత్ కుమార్,హరిత,రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించాడు.
Also Read