బచ్చలమల్లి ఓటిటి లోకి వచ్చేసింది
on Jan 10, 2025
అల్లరి నరేష్(Allari naresh)హీరోగా 'సోలో బతుకే సోలో బెటర్' ఫేమ్ సుబ్బు(subbu mangadevi)దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'బచ్చల మల్లి'(Bachala malli) 'హనుమాన్'(Hanuman)మూవీ ఫేమ్ 'అమృత అయ్యర్'(amritha aiyer)హీరోయిన్ గా చెయ్యగా రావు రమేష్,హరితేజ,అచ్యుత్ కుమార్,అంకిత కొయ్య,తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.హాస్య క్రియేషన్స్ పై రాజేష్ దండ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 20 న థియేటర్స్ లో అడుగుపెట్టి పర్వాలేదనే టాక్ ని పొందింది.
ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో అడుగుపెట్టింది.అమెజాన్ ప్రైమ్ ద్వారా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.ఒక వ్యకి ఎంత మంచి వాడైనా సరే జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాల్లో మనల్నిప్రేమించే వాళ్ళు మనకి ఎంత మంచి చెప్తున్నా కూడా,మూర్ఖత్వంతో వాళ్ల మాటలు వినం.దీంతో మన జీవితమే కాకుండా మనల్ని నమ్ముకున్న జీవితాలు కూడా ఎలా పతనమైపోతాయోఈ మూవీలో చాలా చక్కగా చూపించారు.
ఇక అల్లరి నరేష్ మాస్ నటన ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ ని కలిగిస్తుంది.'బచ్చల మల్లి' క్యారక్టర్ లో జీవించాడని చెప్పవచ్చు,అమృత అయ్యర్ తో పాటు రావు రమేష్ నటన కూడా ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.ముఖ్యంగా క్లైమాక్స్ లో నా మూర్కత్వంతో జీవితంలో సాధించింది ఏది లేదు,పైగా నా కోసం ఎన్నో వదులుకొని,నేనే జీవితంగా బతికిన ప్రియురాలని కూడా ఆత్మహత్య చేసుకునేలా చేసానని తలుచుకొంటు 'బచ్చల మల్లి' మరణించడం ప్రతి ఒక్కర్ని ఆలోచింపచేస్తుంది.