Home

»

Latest News

మరో మెట్టు ఎక్కిన బాహుబలి.. సతరన్‌ నామినేషన్స్‌లో బాహుబలి..

Feb 27, 2016 11:47AM

దర్శకుడు రాజమౌళి బాహుబలి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఎంతో అద్భుత కళాఖండంగా తెర కెక్కిన బాహుబలి అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాకి గాను.. చలన చిత్ర రంగంలో రాజమౌళి పద్మశ్రీ అవార్డును కూడా దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు మరో అత్యంత ప్రతిష్టాత్మకమైన సతరన్‌ అవార్డ్స్ నామనేషన్స్‌లో బాహుబలికి స్థానం దక్కింది. సతరన్‌ అవార్డులు సైన్స్‌ ఫింక్షన్‌, ఫాంటసీ, హరర్‌ సినిమాలకు అందజేస్తారు. మొత్తం ఐదు విభాగాల్లో ఈ చిత్రం నామినేషన్లు దక్కించుకుంది హాలీవుడ్‌ చిత్రాలైన స్టార్‌ వార్స్‌ ది ఫోర్స్‌ అవేకెన్స్‌, మాడ్‌ మాక్స్‌ ఫ్యూరీ రోడ్‌, ది రెవెనంట్‌, స్పెక్టర్‌, స్పై వంటి చిత్రాలకు స్థానం లభించిన చోట బాహుబలి ఐదు విభాగాల్లో నామినేట్‌ కావడం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com