ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు!!
on Jul 1, 2015
క్రేజ్ వున్న సినిమాకు బెనిఫిట్ షోల పేరిట వ్యాపారం సాగడం మామూలే. అయితే ప్రస్తుతం బాహుబలి సినిమా చూడలని ఎంతో ఆత్రుతగా వున్న జనాలు బాహుబలి సినిమా బెనిఫిట్ షో టికెట్ల కోసం ప్రయత్నించి, చెబుతున్న రేట్లు చూసి అవాక్కవుతున్నారట. బాహుబలి జులై 10 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అమెరికా, ముంబయ్, హైదరాబాద్ ల్లో బెనిఫిట్ షోల స్ర్కీనింగ్ భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రీమియర్ షో టిక్కెట్ రేట్ 4 వేల నుంచి 6 వేల వరకూ వున్నాయట. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా టికెట్ కొనటానికి వెనకడుగు వేస్తున్నారట. అందుకే బెనిఫిట్ షోలకు రేటు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారట. అలా తగ్గించినా కూడా రెండు వేల లోపు టికెట్ వుండదని వినికిడి.