ప్రభాస్ కి 6000 ల మ్యారేజ్ ప్రపోజల్స్
on May 4, 2017
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి కోసం తన పెళ్లినే పక్కకు పెట్టిన గొప్ప వ్యక్తిత్వం ప్రభాస్ ది. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు గత కొన్నేళ్లుగా ఎన్ని సార్లు పెళ్లి ప్రస్థావన తీసుకు వచ్చినా బాహుబలి రెండు పార్ట్ లు అయిపోయింతర్వాతే ఆలోచిస్తా అని చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తానికి, బాహుబలి 2 విడుదలయి అలజడి సృష్టిస్తుంది. కానీ, ప్రభాస్ మాత్రం తన పెళ్లి గురించి ఇంకా నోరు మెదపడం లేదు. ఇంతలోనే, సుజీత్ దర్శకత్వంలో సాహూ అనే యాక్షన్ చిత్రం మొదలు పెట్టాడు.
సాహూ కూడా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న సినిమా కాబట్టి ప్రభాస్ ఇది కూడా పూర్తయ్యే వరకు పెళ్లి గురించి మాట్లాడక పోవచ్చు. అయితే, ప్రభాస్ అమ్మ, పేద నాన్న కృష్ణం రాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పెళ్లి తతంగం ముగియాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఒక వేళ, వాళ్ల బాధ భరించ లేక ప్రభాస్ పెళ్ళికి ఒప్పుకుంటే అతని లేడీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. బాహుబలి చేస్తున్న టైం లో ప్రభాస్ కి దాదాపు 6000 ల మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయంటే మనోడికి అమ్మాయిల్లో ఎంత ఫాలోయింగ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కానీ, వీటన్నింటిని రిజెక్ట్ చేసిన ప్రభాస్ తన పెద్ద వాళ్ళు మెచ్చిన అమ్మాయినే చేసుకోవాలని డిసైడ్ అయ్యాడంట. కానీ, అదెప్పుడో మాత్రం చెప్పలేం!