బాహుబలి టీం కి ఘోర అవమానం!
on Apr 26, 2017

బాహుబలి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కి దుబాయ్ వెళ్లిన సంగతి మనకి విదితమే. ఈ రోజు ఉదయం వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. అయితే, తమకి తీవ్ర అవమానం జరిగిందని చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ తెలిపారు. ఎమిరేట్స్ స్టాఫ్ మెంబర్స్ తమతో దురుసుగా ప్రవర్తించారని, తాను ఇంతకు ముందు చాల సార్లు ఎమిరేట్స్ లో ప్రయాణం చేసినా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని చెప్పారు. శోబుతో పాటు, ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి ఇదే ఫ్లైట్ లో ప్రయాణం చేసారు. అయితే, ఎమిరేట్స్ యాజమాన్యం ఈ విషయంలో స్పందించారని తెలిసింది. బాహుబలి చిత్ర యూనిట్ బుకింగ్ రిఫరెన్స్ ప్రైవేట్ గా పంపమని శోబుని కోరారు, తద్వారా అసలు ఏం జరిగింది, తప్పు ఎవరిది అనే విషయంలో క్లారిటీ వస్తుందనేది వాళ్ళ అభిప్రాయం. బాహుబలి 2 సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయనే వార్తలకి స్పందిస్తూ, అసలు ఇంతవరకు సెన్సార్ వాళ్ళకి తప్ప ఎక్కడ సినిమా షోలు వేయలేదు అని వివరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



