Home

»

Latest News

బాహుబలి లీకు వీరుడు అరెస్ట్

Nov 22, 2016 4:44PM

తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్ధాయిలో తెలియజేసిన సినిమా బాహుబలి. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా బాహుబలి ద కన్‌క్లూజన్ పేరిట సెకండ్ పార్ట్‌ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అయితే మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు ఈ సినిమాలో ఎన్నో చిక్కుముడులకు సెకాండఫ్‌లో ఆన్సర్ దొరుకుతుందని దర్శకనిర్మాతలు ప్రకటించడంతో బాహుబలి-2పై భారీ అంచనాలున్నాయి.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన తొమ్మిది నిమిషాల వీడియో లీక్ కావ్వడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. గతంలో బాహుబలి-1 షూటింగ్‌లోనే ఉండగా కూడా పోరాట సన్నివేశాలు ఇలాగే లీక్ అయ్యాయి. తాజా లీక్‌తో రంగంలోకి దిగిన చిత్రయూనిట్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు వీడియో లింక్ ఆధారంగా నిందితుణ్ని వేటాడారు. దర్యాప్తులో భాగంగా ఈ సినిమాకు గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తోన్న కృష్ణ నిందితుడిగా తేలింది. బాహుబలి-2కు సంబంధించిన 9 నిమిషాల వీడియోనను కృష్ణ విజయవాడలోని తన ఫ్రెండ్స్‌కు పంపాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా కోట్లాది మందికి చేరిపోయింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com