కృష్ణ నుంచి తృటిలో తప్పించుకున్న నాగ్
on Nov 25, 2016

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన బాహుబలికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న బాహుబలి-2 సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు లీకవ్వడం టాలీవుడ్‌ని షాక్‌కు గురిచేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి లీక్ జరగడం చిత్ర యూనిట్‌ను ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే రంగంలోకి దిగిన దర్శకనిర్మాతలు లీకు వీరుడిని పట్టుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం..దర్యాప్తులో ఆ సినిమా గ్రాఫిక్ ఎడిటర్ కృష్ణ నిందితుడిగా తేలడం చకచకా జరిగిపోయాయి.
ప్రస్తుతం జైల్లో ఉన్న కృష్ణ పోలీసులకు నివ్వెరపోయే మరో నిజాన్ని వెల్లడించాడు. అదేంటంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగ్ హీరోగా నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ సినిమా సీన్లు కూడా ఇంటర్నెట్‌లో లీకవ్వాల్సినవేనట. ఈ సినిమాకు సంబంధించి ఆరు నిమిషాల ఫుటేజ్ కృష్ణ వద్ద ఉందట. అయితే ఆ సీన్‌లను తన ఫ్రెండ్స్‌కు పంపించాడు కానీ నెట్‌లో పెట్టలేదు. ఈలోగా బాహుబలి-2 లీకేజ్ విషయంలో పోలీసులు కూపీ లాగడంతో కృష్ణ దొరికిపోయాడు లేదంటే నాగ్ సినిమా సీన్లు కూడా నెట్‌లో దర్శనమిచ్చేవి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



