టీజర్ రివ్యూ: అ!
on Jan 4, 2018
వరుస హిట్లతో హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్న నేచురల్ స్టార్ నాని నిర్మాతగా అవతారమెత్తి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రశాంత్ వర్మ అనే కుర్రాడు చెప్పిన కథకి ఫ్లాట్ అయ్యి "అ!" అనే సినిమాకు తాను ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నట్లు నాని అనౌన్స్ చేశాడు. అంతగా ప్రశాంత్ నానిని ఎలా మాయ చేశాడో తెలుసుకోవాలని టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూసింది. అందుకు తగ్గట్టుగానే ఇందులో నటించిన అన్ని పాత్రల ఫస్ట్‌లుక్స్‌ని.. డిఫరెంట్‌గా ఇంట్రడ్యూస్ చేసి ఇప్పటికే ఉన్న అంచనాలను మరింతగా పెంచాడు ప్రశాంత్ వర్మ.
తాజాగా ఇవాళ " అ!" మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది యూనిట్. "అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అంటూ" చేప రూపంలో ఉన్న నాని చెబుతుండగా.. చెట్టు రూపంలో ఉన్న రవితేజ కొత్తగా "ఏమైనా చెప్పండ్రా" అనే వాయిస్‌ఓవర్‌తో టీజర్ స్టార్టవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అన్ని పాత్రలను ఓ రౌండ్ వేస్తూ డీఫరెంట్గా టీజర్ కట్ చేశాడు ప్రశాంత్. టేకింగ్, టెక్నికల్ వాల్యూస్, సినిమాటోగ్రఫి అదిరిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. తొమ్మది పాత్రల చుట్టూ తిరిగే ఈ మూవీలో నిత్యామీనన్, కాజల్, అవసరాల శ్రీనివాస్, రెజీనా, ప్రియదర్శి, మురళీశర్మ, రోహిణి, ఈషారెబ్బ, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై నాని నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరిలో అ! ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read