Home

»

Latest News

అవికాకు యంగ్ హీరో నుంచి వేధింపులు..?

Nov 22, 2016 3:09PM

చిన్నారి పెళ్లికూతురు చిత్రంలో ఆనందిగా దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకుని ఉయ్యాలా జంపాలా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది అవికా గోర్. ఆ తర్వాత వెంటనే రెండు మూడు సక్సెస్‌లతో దూసుకెళ్లినా ఆ ఊపు కంటిన్యూ చేయలేకపోయింది. రీసెంట్‌గా రిలీజైన నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడాతో తిరిగి ఫాంలోకి వచ్చింది అవికా. ఈ సంగతి పక్కనబెడితే..ఈమెని టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరో వేధిస్తున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది.

వాట్సాప్‌ ద్వారా అసభ్యసందేశాలను అవికాకు పంపుతున్నాడట ఆ హీరో. ఫస్ట్ లైట్‌గా తీసుకున్నా కానీ..రాను రాను టార్చర్ ఎక్కువ కావడంతో ఆ ఆకతాయి ఎవరా అని ఆరా తీస్తే తనకు బాగా తెలిసిన ఓ యంగ్ హీరో అని తేలడంతో అవికా షాక్‌కు గురైంది. ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడిందట ఈ చిన్నారి. ఆ ఆకతాయి చర్యల కారణంగా తనకు టాలీవుడ్‌లో నటించాలంటేనే విరక్తి కలుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసిందట. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com