![]()
లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజైన జేమ్స్ కేమెరూన్(James Cameron)అద్భుత సృష్టి అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ సృష్టించిన సంచలనం తెలిసిందే. మొదటి రెండు భాగాల స్థాయిలో మెప్పించలేకపోయినా డిజప్పాయింట్ మాత్రం చేయలేదని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓటిటి న్యూస్ వచ్చేసింది
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ జూన్ 24 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారకంగా ప్రకటించింది. దీంతో అవతార్ అభిమానులు మరోసారి పండోరా ప్రపంచాన్ని ఇంటి వద్ద నుంచే ఆస్వాదించే అవకాశం దక్కనుంది. అయితే దీనికి ముందు ఈ చిత్రం డిజిటల్ రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సినిమాను వీక్షించవచ్చు. ఇదే సమయంలో భారతీయ ప్రేక్షకుల కోసం పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read: Michael Jackson: మైఖేల్ జాక్సన్ బతికే ఉన్నాడా!. ఫేక్ డెత్ ప్లాన్ చేసింది నిజమేనా!
భారత్‌లో జియో హాట్ స్టార్ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ ఉండొచ్చని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీలో ఈ విజువల్ వండర్‌ని చూసే అవకాశం దక్కనుంది.






