దిల్ రాజుతో ఆస్ట్రేలియా అధికారులు భేటీ..ఈసారి గురి తప్పదు
on Apr 12, 2025
ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju)కి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో మూడున్నర దశాబ్దాలకి పైగా అనుబంధం కొనసాగుతు వస్తుంది.ఈ జర్నీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలని ప్రేక్షకులకి అందిస్తు వస్తున్నారు.మొన్న సంక్రాంతికి విక్టరీ వెంకటేష్(Venkatesh)తో చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki Vasthunnam)తో భారీ హిట్ ని అందుకున్నాడు.
దిల్ రాజు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిలిండెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆస్ట్రేలియా దేశానికీ చెందిన కాన్సులేట్ జనరల్ ప్రతినిధుల బృందంభారత్(Bharath)ఆస్ట్రేలియా(Australia)దేశాల మధ్య ఉన్న సినిమా సాంసృతిక రంగాలని మరింత బలోపేతం చెయ్యటానికి దిల్ రాజుతో భేటీ అయ్యింది.ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సినిమా నిర్మాణాలు,నటీనటులు,సాంకేతిక నిపుణుల సహకారంపై చర్చ జరిగింది.డిప్యూటీ కౌన్సిల్ జనరల్ స్టీవెన్ కానోలి, వైస్ కౌన్సిల్ జనరల్ హరియట్ వైట్, స్టెప్పీ చరియన్ దిల్ రాజుని కలిసిన వారిలో ఉన్నారు వారంతా తెలుగు సినిమాపై,హైదరాబాద్ పై ఎంతో ఆసక్తి కనపర్చడమే కాకుండా ఈ భేటీతో తెలుగు సినిమాకి ఆస్ట్రేలియాలో మంచి అవకాశాలు వస్తాయని ప్రతినిదులు తెలిపారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
