'హరిహర వీరమల్లు'కు ఆర్ట్ డైరెక్టర్ మారాడు!
on Dec 1, 2021
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తోన్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఈ ఏడాది మొదట్లో ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకొని అర్ధంతరంగా ఆగిపోయింది. ఆ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసుకొని 'భీమ్లా నాయక్' షూటింగ్ చేస్తూ వచ్చాడు పవర్‌స్టార్. ఇప్పుడు 'భీమ్లా నాయక్' షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌కు వచ్చింది. దాంతో 'హరిహర వీరమల్లు'ను లైన్‌లో పెట్టాడు పవన్. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొనబోతున్నట్లు సమాచారం.
కాగా ఈ మధ్యలో మూవీ టెక్నీషియన్స్‌కు సంబంధించి ఒక మార్పు జరిగింది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ప్లేస్‌లో ఆనంద్ సాయి వచ్చాడు. ఇదివరకు ఈ సినిమా కోసం చార్మినార్, మచిలీపట్నం కోట సెట్లను రాజీవన్ నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయన సేవలను నిలిపేసి, ఆనంద్ సాయిని తీసుకొచ్చారు. ఈ మార్పు పవన్ సూచించినదేనని ఇండస్ట్రీలో ప్రచారమవుతోంది. పవన్, ఆనంద్ సాయి మధ్య మంచి అనుబంధం ఉంది. పవన్ పలు సినిమాలకు సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు'లో పవన్ రాబిన్ హుడ్ టైపు క్యారెక్టర్ పోషిస్తున్నాడు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని ఎం.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
