అర్జున్‌రెడ్డి రానాకి నచ్చలేదా..?
on Aug 29, 2017
హైదరాబాద్ ఫిలింనగర్ కానీ..బెజవాడ బెంజిసర్కిల్ కానీ..వైజాగ్ జగదాంబ సెంటర్కానీ..కడప సెవెన్ రోడ్ సర్కిల్ అవ్వనీ ఏ ప్లేస్ అయినా నలుగురు కలిస్తే ఒకటే చర్చ..అర్జున్ రెడ్డి..అర్జున్ రెడ్డి. బాహుబలి తర్వాత ప్రేక్షకులు ఒక సినిమా గురించి అంతగామాట్లాడుకున్నారంటే అది అర్జున్ రెడ్డి గురించే. సినిమా చూసొచ్చాక అందులో తప్పొప్పుల్ని లెక్కబెడుతూ ఉంటారు జనాలు. నిజమే ఎంత గొప్ప దర్శకుడైనా తప్పులు లేకుండా సినిమా తెరకెక్కించలేడు. సరే అసలు మ్యాటర్‌లోకి వెళ్తే..విజయ్ దేవరకొండ నటించిన అర్జున్‌రెడ్డి గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆడాల్ట్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది..సహజంగానే దీనిపై సాంప్రదాయ వాదులు మండిపడ్డారు..యువతను తప్పుదారి పట్టించేలా ఉందని..సమాజానికి మంచిది కాదని ఇలా చాలా రకాలుగా విమర్శించారు. టాలీవుడ్ సెలబ్రీటీలు కూడా ఎవరి ఓపీనియన్ వాళ్లు చెప్పారు. తాజాగా భల్లాలదేవుడు రానా కూడా స్పందించాడు. "నేను అర్జున్ రెడ్డి చూశాను..సెకండాఫ్‌లో కొన్ని తప్పులున్నాయి కానీ..విజయ్ కుమ్మేశాడు..తన యాక్టింగ్‌తో సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడన్నాడు. సినిమా చూసిన వాళ్లందరూ సెకండాఫ్ కొంచెం డల్‌గా ఉందంటున్నారు. రానా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. కానీ తను ఎంచుకున్న ఫ్లాట్ ఫాం కరెక్ట్ కాదనేది కొందరి అభిప్రాయం. రానా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ నెగెటీవ్ కామెంట్స్ వస్తున్నాయి. ఒక సినిమాకి సంబంధించిన వ్యక్తి అయ్యుండి ఇంకో సినిమాపై తప్పుగా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని అంటున్నారు విజయ్ అభిమానులు.