దర్శకుని షుగర్ ఫ్యాక్టరీ !
on Jan 3, 2018

అర్జున్ రెడ్డి సినిమాతో సిని పరిశ్రమ మొత్తాన్నీ తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు వంగ సందీప్ రెడ్డి... తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడు? ఒక వేళ తీసినా... ‘అర్జున్ రెడ్డి’ మేజిక్ మళ్లీ రిపీట్ చేయగలుగుతాడా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న. దానికి సమాధానం ఇస్తూ.. సందీప్ ఓ కథను రెడీ చేశాడనేది విశ్వసనీయ సమాచారం. వాస్తవిక ప్రేమకథాంశంతో సందీప్ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీశాడు. ఫలానా తరహా సినిమా తీసి హిట్ కొడితే... అదే మూసలో కొట్టుకుపోవడం మన దర్శకులకు పరిపాటి. మరి వంగా సందీప్ కూడా అలాగే వెళ్తాడా? అనంటే.. కాదనే తెలుస్తోంది. ఈ దఫా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో వంగా సందీప్ కథ సిద్ధం చేశాడట. తన దగ్గర ఉన్న ఓ పది కథల్లో బెస్ట్ కథను ఎంచుకొని సీన్ ఆర్డర్ తో పాటు... డైలాగ్ వెర్షన్ కూడా సిద్ధం చేశాడట సందీప్. ఇంతకీ సినిమా పేరు చెప్పనేలేదు కదూ.. ‘షుగర్ ఫ్యాక్టరి’. మరి ఈ కథను ఎవరితో తీస్తాడు? అనేది కూడా ఆసక్తికరమైన విషయమే. ఇప్పటికి ముగ్గురు స్టార్ హీరోలకు ఈ కథ చెప్పాడట. ముగ్గురూ పాజిటీవ్ గానే స్పందించినట్లు సమాచారం. వారిలో ఎవరు ‘ఓకే’ అవుతారో కాలమే సమాధానం చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



