పొట్టను చూసి ఫీలవుతున్న రెహమన్
on Nov 27, 2017

ఏఆర్ రెహమన్.. భారతీయ సంగీతం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పి.. అందని ద్రాక్షలా వూరిస్తున్న ఆస్కార్ అవార్డ్ అందుకొని ఆ లోటును పూడ్చాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ స్వరమాంత్రీకుడి బాణీల కోసం హాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎందరో పడిగాపులు కాస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్‌లో చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో మ్యూజికల్ షో ఇచ్చారు రెహమన్. ఈ సందర్భంగా ఓ పేపర్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తన కెరీర్ గురించి.. ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.
తాను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ రమేశ్ నాయుడు, రాజ్-కోటీల మధ్య ఓ చిన్న పిల్లవాడిగా మెలిగిన రోజులే ఇష్టమని అన్నారు.. ఎందరో గొప్ప దర్శకుల సినిమాలకు సంగీతం అందించినా.. బాపు, కె.విశ్వనాథ్ దగ్గర పనిచేయలేకపోవడం తనకు తీరని కలగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు తన వయసు పెరిగిపోతోందని అలాగే పొట్ట కూడా పెరిగిపోతోందని.. వర్కవుట్లు చేసే తీరిక లేక పొట్టను గురించి పట్టించుకోవడం మానేశానని రెహమన్ నవ్వుతూ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



