నాకు ఏడు సంవత్సరాలు పట్టిందని మీకు తెలుసా!
on Dec 27, 2024
ఏఆర్ రెహమాన్(ar rehman)సంగీతాన్ని ఇష్టపడని భారతీయ సినీ ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన స్వర రచనలో వచ్చిన ప్రతి పాట కూడా సరికొత్త నవ్యత తో కూడుకొని ఉంటుంది. సంగీత దర్శకులకి కూడా వీరాభిమానులు ఉంటారని కూడా నిరూపించిన రెహమాన్ ఆస్కార్ ని సైతం అందుకొని భారతీయ సినీ రంగానికి ఎనలేని కీర్తిని గడించేలా చేసాడు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రెహ్ మాన్ తన కెరీర్ లో గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతు 1985 ,86 మధ్య జరిగిన ఒక సంఘటన సంగీతం విషయంలో నన్నెంతో మార్చేసింది.గతంలో మా బ్యాండ్ లో చాలా మంది మెంబర్స్ ఉండేవాళ్ళు.అందులో గిటారిస్ట్ గా పని చేసే ఒక వ్యక్తి బాగా తాగొచ్చి నువ్వు ఏం ప్లే చేస్తున్నావో అర్ధమవుతుందా,సినిమా మ్యూజిక్ ప్లే చేస్తున్నావు అని చులకనగా మాట్లాడాడు. అప్పుడు నాకు కొంచం బాధగా అనిపించినా కూడా,అతను చెప్పిన మాట అప్పుడు నాకు అర్ధం కాలేదు. కాని ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడానికి వారం రోజుల సమయం పట్టింది.అతను చెప్పిన మాటల ప్రకారం నా సంగీతంలో నేను వర్క్ చేసిన కంపోజర్ల ప్రభావం నాపై ఉందని అర్ధమయ్యింది.దాంతో నాకంటూ సొంతంగా ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకోవాలనున్నాను. అలా చేసుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చాడు.
రెహ్ మాన్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(buchibabu)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి వర్క్ చేస్తున్నాడు.ఇప్పటికే రెండు సాంగ్స్ రికార్డింగ్ కూడా అయ్యాయని రెహ్మాన్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలియచేసాడు.ఇటీవల తన భార్య సైరా భాను నుంచి రెహ్ మాన్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read