హీరోయిన్లకు వర్మ కొత్త పేర్లు!
on Jul 7, 2020
క్లైమాక్స్, నేక్డ్ సూపర్ సక్సెస్ తరవాత ‘ఆర్జీవీవరల్డ్థియేటర్’లో నెక్ట్స్ సినిమా సినిమా ‘థ్రిల్లర్’లో హీరోయిన్ అప్సరా రాణి అని సోమవారం సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. అమ్మాయి ఫొటోషూట్ కూడా పోస్ట్ చేశారు. ఒంటి మీద డ్రస్ ఉండటం పాపం అన్నట్టు అందాలు ఆరబోస్తూ ఫొటోలు దిగింది అప్పరా రాణి. అయితే, ఆ అమ్మాయి అసలు పేరు అది కాదు. ఈ హాట్ బ్యూటీ పేరు అంకితా మహారాణ. తెలుగులో ‘4 లెటర్స్’, ‘ఉల్లాల ఉల్లాల’ సినిమాలు చేసింది. తొలి సినిమా ‘4 లెటర్స్’లో బికినీల్లో సందడి చేసింది. ‘ఉల్లాల ఉల్లాల’లోనూ హాట్ సీన్స్ చేసింది. ఆ అమ్మాయి పేరు అప్సరా రాణిగా వర్మ మార్చారు. పైగా, హాట్ ఫొటోషూట్‌తో అందరూ ఆమె గురించి మాట్లాడుకునేలా చేశాడు.
ఇటీవల వర్మ ‘నేక్డ్’లో నటించిన స్వీటీ అసలు పేరు కూడా అది కాదు. ఇప్పుడు ఆమెను ప్రేక్షకులకు ఆమె స్వీటీగా గుర్తుపడుతున్నారు. అయితే, ఆమె అసలు పేరు శ్రీ రాపాక. అదీ సంగతి. ఇలా హీరోయిన్ల పేర్లను వర్మ మారుస్తున్నారు. అప్సరా రాణి ఫొటోషూట్ చూస్తే... ‘థ్రిల్లర్’ కూడా హాట్ సినిమా అనిపిస్తోంది.