Home

»

Latest News

‘ఘాటి’ సెన్సార్‌ రిపోర్ట్‌.. ఆడియన్స్‌ షాక్‌ అవ్వడం ఖాయం!

Aug 30, 2025 2:24PM

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఘాటి’. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 

2 గంటల 37 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమాకి సెన్సార్‌ వారు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో అనుష్క చాలా పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో నటించారు. ఆమె పోషించిన శీలవతి పాత్ర ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్‌ ఎంతో కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌ని విపరీతంగా థ్రిల్‌ చేస్తాయని తెలుస్తోంది. 

ఈ సినిమాను చూసిన సెన్సార్‌ సభ్యులు సినిమాకి పాజిటివ్‌ రిపోర్ట్‌ ఇచ్చారని సమాచారం. ఈ కథ ఎమోషనల్‌గా స్టార్ట్‌ అవుతుందని ఫస్ట్‌హాఫ్‌ అంతా సాధారణంగా కనిపించినా సెకండాఫ్‌ మాత్రం ఆడియన్స్‌ షాక్‌ అయ్యేలా ఉంటుందని తెలుస్తోంది. గంజాయి మాఫియా నేపథ్యంపై చేసే పోరాటంగా ఈ సినిమా ఉండబోతోంది. ఈమధ్యకాలంలో అనుష్క నటించిన సినిమా ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. దాంతో ఆమె అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. టోటల్‌గా ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని, అనుష్క కెరీర్‌లో ఇదో గొప్ప సినిమాగా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com