నోస్టాల్జియా: అన్నలతో చిన్నారి అనుష్క!
on Aug 3, 2020
తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన ప్రేమను, ఆ బంధాన్ని మాటల్లో వర్ణించలేమని అగ్ర కథానాయిక అనుష్క అలియాస్ స్వీటీ శెట్టి చెబుతున్నారు. రక్షా బంధన్ సందర్భంగా అందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ప్రేమ, ఆప్యాయలతో రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరినీ విష్ చేశారు. అలాగే, చిన్నతనంలో తన సోదరులతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అనుష్కకు ఇద్దరు బ్రదర్స్. అందులో ఒకరు డాక్టర్. వాళ్లు బెంగళూరులో ఉంటారు. అనుష్క హైదరాబాద్ లో ఉంటారు. అందువల్ల, నేరుగా కలవలేకపోయరో? సాధారణంగా వ్యక్తిగత విషయాలు ఎక్కువగా బయటపెట్టడం ఇష్టం లేని ఆమె ప్రజెంట్ ఫొటోలు పోస్ట్ చేయలేదో... ఈ ఓల్డ్ ఫొటో మాత్రం ప్రేక్షకులను అలరిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
