అనుష్క పెళ్లిపై మరో వార్త
on Nov 30, 2016
ఆ హీరోయిన్ పెళ్లి ఎప్పుడు.. అనగానే మొదట గుర్తుకొచ్చే పేరు అనుష్క. సౌత్‌లో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోవాల్సి ఉన్నప్పటికీ. మీడియా, జనం చూపు మాత్రం ఎప్పుడూ జేజేమ్మ గురించే. ఆమె కన్నా ముందు సినిమాల్లోకి వచ్చినవాళ్లు.. ఆమె వెనుక కెరిర్ స్టార్ట్ చేసిన వారు, ఆమెతో పాటు నడిచిన చాలా మంది భామలు పెళ్లి చేసుకుని హ్యాపిగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుండగా అనుష్క మాత్రం ఇంకా టాప్ హీరోయిన్గా కొనసాగడం వల్లనేమో కానీ స్వీటీ పెళ్లిపై క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. మొన్నామధ్య టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌తో అనుష్క పెళ్లి ఫిక్సయిపోయిందని వరుస కథనాలు వచ్చాయి. కానీ అది గాలివార్తేనని తేలింది.
ఇప్పుడు తాజాగా బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానితో అనుష్కకు పెళ్లి ఫిక్సయిందట. ఒక ఫంక్షన్లో అతన్ని కలిసిన స్వీటీ పేరేంట్స్ ఆమెకు అతనే పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫిక్సయ్యారట. ఈ విషయం అరుంధతి దృష్టికి తీసుకువెళ్లడం, దానికి స్వీటీ ఓకే చెప్పడం వెంట వెంటనే జరిగిపోయాయట. దీంతో వచ్చే ఏడాది వీరిద్దరికి పెళ్లి చేయాలని అనుష్క తల్లిదండ్రులు భావిస్తున్నారట. ఇప్పటికే ఈ బ్యూటీ పెళ్లి గురించి అనేక వార్తలు రావడం..అవన్నీ పుకార్లేనని తేలిపోవడం తెలిసిందే..మరి ఈ వార్తలో నిజమేంత అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయకతప్పదు.