Home

»

Latest News

విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క.. ఈ సారైనా విజ‌యం ద‌క్కేనా!

Nov 30, 2021 4:57PM

`నిశ్శ‌బ్దం` త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి.. త్వ‌ర‌లో యూవీ క్రియేష‌న్స్ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `మిర్చి`, `భాగ‌మ‌తి` త‌రువాత స్వీటీ - యూవీ కాంబోలో హ్యాట్రిక్ ఎటెంప్ట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్క ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. రీసెంట్ గా `త‌లైవి` వంటి బ‌యోపిక్ తో ప‌ల‌క‌రించిన వెర్సటైల్ డైరెక్ట‌ర్ ఎ.ఎల్. విజ‌య్ కాంబినేష‌న్ లో ఈ మూవీ రూపొంద‌నుంద‌ట‌. ఇప్ప‌టికే విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో `దైవ తిరుమ‌గ‌ళ్` (తెలుగులో `నాన్న‌`), `తాండ‌వం` (తెలుగులో `శివ తాండ‌వం`) వంటి చిత్రాల్లో న‌టించింది స్వీటీ. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో.. థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్ మూవీతోనైనా అనుష్క - విజ‌య్ కాంబో స‌క్సెస్ అందుకుంటుందేమో చూడాలి.  కాగా, జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని.. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో సిల్వ‌ర్ స్క్రీన్ పైకి వ‌స్తుంద‌ని కోలీవుడ్ బ‌జ్. త్వ‌ర‌లోనే అనుష్క - విజ‌య్ కాంబో మూవీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com