ENGLISH | TELUGU  

బిగ్ డైరెక్టర్ ని చంపేస్తామని అంటున్నారు..కూతురు కంటే ఎక్కువ కాదు    

on Apr 19, 2025

విజయ్ సేతుపతి(Vijay Sethupathi)గత ఏడాది జూన్ లో 'మహారాజ'(Maharaja)తో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సెల్వం అనే నెగిటివ్ క్యారక్టర్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap). రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'సత్య' మూవీతో రైటర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనురాగ్ కశ్యప్, ఆ తర్వాత 'పాంచ్' అనే మూవీతో దర్శకుడుగా మారి నో స్మోకింగ్, బ్లాక్ ఫ్రైడే, రిటర్న్ ఆఫ్ హనుమాన్, అగ్లీ, బాంబే వెల్వెట్, రామన్ రాఘవన్, చోక్డ్, ఇలా సుమారు పదిహేడు సినిమాలకి పైగా తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. భారీ తనానికి వెళ్లకుండా కథ, కథనాల్ని మాత్రమే నమ్ముకొని  సినిమాని తెరకెక్కించడంలో అనురాగ్ కశ్యప్ ముందు వరుసలో ఉంటాడు. కాకపోతే ఇటీవలే ఆయన మాట్లాడుతు హిందీ చిత్ర పరిశ్రమ విషపూరితంగా మారిందని, బాలీవుడ్ ని వీడి దక్షిణాదికి వెళ్తున్నాన ని ప్రకటించాడు. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నానని కూడా చెప్పాడు.

రీసెంట్ గా అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ అప్ కమింగ్ మూవీ 'పూలే'(Phule)కి సంబంధించి ఒక వర్గానికి చెందిన వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ విషయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ ని రిలీజ్ చేసాడు. 'నేను చేసిన కామెంట్స్ కొంత మంది మనోభావాల్ని దెబ్బతీశాయి. నా కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. నా కూతురు పై కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. నా కూతురు కంటే నాకు ఏది విలువైంది కాదు. నన్ను తిట్టండి. కానీ నా కుటుంబాన్ని వివాదంలోకి తీసుకురావద్దు. నా నుంచి మీరు కోరినట్టుగానే బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నానని సదరు నోట్ లో పేర్కొన్నాడు. 

'పూలే' మూవీ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాడిన 'మహాత్మా జ్యోతిరావు ఫూలే'(Mahatma Jyothi rao phule)ఆయన భార్య 'సావిత్రి బాయి ఫూలే(Savitribai Phule) జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. దీంతో మూవీలో   తమ సమాజాన్ని తప్పుగా చూపిస్తున్నారని బ్రాహ్మణ సమాజంలోని కొందరు వ్య‌క్తులు ఆరోపిస్తున్నారు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కూడా మూవీలోని 'మాంగ్’, ‘మహర్’, ‘పేష్వాయి’ వంటి పదాలను తొలగించాలని, ‘3000 సంవత్సరాల గులామీ’ అనే డైలాగ్‌ను ‘కొన్ని సంవత్సరాల గులామీ’గా మార్చాలని   ఆదేశించింది. కానీ ద‌ర్శ‌కుడు అంగీకరించకపోవడంతో రిలీజ్ ఆపాల‌ని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపైనే  బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ బ్రాహ్మణులని కించపరుస్తు వరుస ట్వీట్ లు చేసాడు. సెన్సార్ బోర్డ్‌పై కూడా విమర్శనాస్త్రాలు గుప్పించాడు. ఫూలే మూవీ విషయానికి వస్తే  జ్యోతిరావు ఫూలే క్యారక్టర్ లో గుజరాత్ నటుడు ప్ర‌తీక్ గాంధీ కనపడుతుండగా భార్య సావిత్రి బాయి ఫూలే గా,ప్రముఖ హీరో రాజ్ కుమార్ రావు భార్య ప‌త్ర‌లేఖ పోషించింది. అనంత్ నారాయణ్ మహాదేవన్(Anant Narayan Mahadevan)ద‌ర్శ‌క‌త్వంలో  జీ స్టూడియోస్,ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, సునీల్ జైన్ త‌దిత‌రులు సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.

 


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.